ఏలకులు అనేక గుణాలను, పోషకాలను కలిగి ఉన్నాయి. ఉదయాన్నే పరగడుపున ఏలకుల నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఏలకులు ఒక ఆయుర్వేద మూలిక.. ఇది సుగంధ ద్రవ్యాల పరిధిలోకి వస్తుంది. దాని వాసన, రుచి, లక్షణాల కారణంగా.. దీనిని ఔషధంగా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది సహాయకరంగా ఉంటుంది.