సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ వికెట్ పడగొట్టినప్పుడు, హర్షిత్ రాణా మైదానం వెలుపలికి వెళ్లేందుకు చేయి ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇది IPL ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.5 ప్రకారం నేరం. దీంతో రానాపై ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించారు.