Beards And Mustaches: బారెడు మీసం.. గుబురైన గడ్డం తెచ్చిన తంటా! ఏకంగా 80 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీ

సాధారణంగా కంపెనీల్లో పనిచేసే వర్కర్లు, ఉద్యోగులను తొలగించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఓ కంపెనీ విచిత్ర కారణంతో 80 మంది వర్కర్లను ఉద్యోగం నుంచి తీసేసింది. మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వానూ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం 80 మంది కార్మికులను..

Beards And Mustaches: బారెడు మీసం.. గుబురైన గడ్డం తెచ్చిన తంటా! ఏకంగా 80 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీ
Beards And Mustaches
Follow us
Srilakshmi C

|

Updated on: May 02, 2024 | 3:07 PM

సోలాన్‌, మే 2: సాధారణంగా కంపెనీల్లో పనిచేసే వర్కర్లు, ఉద్యోగులను తొలగించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఓ కంపెనీ విచిత్ర కారణంతో 80 మంది వర్కర్లను ఉద్యోగం నుంచి తీసేసింది. మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వానూ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. తమ కంపెనీలో పనిచేసే సదరు ఉద్యోగులు మీసం, గడ్డాలు పెంచారని సాకుగా చెబుతూ.. వారందరినీ బయటికి పంపింది. దీనిపై యాజమాన్యంతో కార్మికులు మాట్లాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో చేసేది లేక కార్మికులు కంపెనీ ముంగిట సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది.

గడ్డం, మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని, క్లీన్‌ షేవింగ్‌తోనే డ్యూటీకి హాజరుకావాలని షరతు పెట్టింది. ఈ విచిత్ర షరతుకు కార్మికులు తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత యాజమాన్యం షరతుకు తలొగ్గి గడ్డం, మీసం తీసేశారు. పాపం.. సదరు కంపెనీ వర్కర్లను విధుల్లోకి తీసుకోకుండా పైశాచిక ఆనందం పొందసాగింది. దీంతో తాము చేసిన తప్పేంటో తెలియక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, సోలన్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. ఈ క్రమంలో పర్వానూ లేబర్ ఇన్‌ స్పెక్టర్ లలిత్ ఠాకుర్ కంపెనీని సందర్శించి యాజమాన్యం, కార్మిక పక్షాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు యత్నించారు.

విచారణకు కలెక్టర్ ఆదేశం

కార్మికుల తొలగింపు ఘటనపై సోలన్ జిల్లా కలెక్టర్ మన్మోహన్ శర్మ ప్రత్యేక దృష్టి సారించారు. గడ్డం, మీపాలు పెంచారని 80 మంది కార్మికులను తొలగించడం అమానుషమని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మన్మోహన్ శర్మ తెలిపారు. కార్మికుల తొలగింపు నిజమేనని తేలితే కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులపై కంపెనీ ఎందుకు ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందనే విషయం విచారణలో తేలుతుందని కలెక్టర్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.