NEET UG 2024 Admit Card: నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. మరో మూడు రోజుల్లోనే పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ 2024 పరీక్ష అడ్మిట్‌కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ వివరాలు నమోదు చేసి నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి..

NEET UG 2024 Admit Card: నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. మరో మూడు రోజుల్లోనే పరీక్ష
NEET UG 2024 Exam admit card
Follow us

|

Updated on: May 02, 2024 | 4:44 PM

హైదరాబాద్‌, మే 2: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ 2024 పరీక్ష అడ్మిట్‌కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్‌ వివరాలు నమోదు చేసి నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు, 13 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరికీ దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష జరుగనుంది. మే 5వ తేదీన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. పెన్‌, పేపర్‌ విధానంలో మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 05:20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

200 నిమిషాలు అంటే 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భారతీయ భాషల్లో ఉంటుంది. ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. నీట్‌ యూజీ పరీక్ష 180 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 720 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత ఉంటుంది. కాగా ప్రతీ యేట ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీయేట 20 లక్షలకు పైగా విద్యార్ధులు నీట్ యూజీ పరీక్షకు పోటీ పడుతుంటారు.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..