AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS DOST 2024 Notification: రేపే తెలంగాణ ‘దోస్త్’ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మూడు విడ‌త‌ల్లో డిగ్రీ అడ్మిష‌న్లు

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివ‌ర్సిటీలు, వాటి ప‌రిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌ (దోస్త్) నోటిఫికేష‌న్ శుక్రవారం (మే 3) విడుద‌ల కానుంది. ఈసారి మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్రక్రియ కొనసాగనుంది. దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభం కానుంది..

TS DOST 2024 Notification: రేపే తెలంగాణ 'దోస్త్' నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మూడు విడ‌త‌ల్లో డిగ్రీ అడ్మిష‌న్లు
TS DOST 2024
Srilakshmi C
|

Updated on: May 02, 2024 | 7:50 PM

Share

హైదరాబాద్‌, మే 2: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివ‌ర్సిటీలు, వాటి ప‌రిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌ (దోస్త్) నోటిఫికేష‌న్ శుక్రవారం (మే 3) విడుద‌ల కానుంది. ఈసారి మొత్తం మూడు విడ‌త‌ల్లో అడ్మిష‌న్ల ప్రక్రియ కొనసాగనుంది. దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభం కానుంది.

డిగ్రీ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు దోస్త్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంట‌ర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్‌లో సాదించిన మార్కలు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. దోస్త్ 2024 నోటిఫికేష‌న్‌ శుక్రవారం (మే 3)వ తేదీన ఉన్నత విద్యామండ‌లి విడుద‌ల చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు రేపు అందుబాటులోకి రానున్నాయి.

కాగా గత ఏడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఏడాది మొత్తం 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా దాదాపు 1,054 కాలేజీలు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us