AP ECET 2024 Hall Tickets: తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సూట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫయింగ్‌ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మే 8వ తేదీన ఈసెట్‌ 2024 పరీక్ష జరగనుండగా.. మే 6వ తేదీన తెలంగాణ ఈసెట్‌ 2024 పరీక్ష..

AP ECET 2024 Hall Tickets: తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!
AP ECET 2024 Hall Tickets
Follow us

|

Updated on: May 02, 2024 | 4:10 PM

హైదరాబాద్‌, మే 2: తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సూట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫయింగ్‌ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మే 8వ తేదీన ఈసెట్‌ 2024 పరీక్ష జరగనుండగా.. మే 6వ తేదీన తెలంగాణ ఈసెట్‌ 2024 పరీక్ష నిర్వహించనున్నారు.

ఈసెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో డైరెక్ట్‌గా సెకండ్‌ ఇయర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ- అనంతపురం నిర్వహిస్తుంది. ఇక తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2024 పరీక్ష హాల్‌టికెట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఈసెట్‌ 2024 పరీక్ష హాల్‌టికెట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డులు విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో 2024-25 ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష మెరిట్ లిస్ట్, ర్యాంకు కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు మోడల్‌ పాఠశాలల అడిషనల్‌ డైరెక్టర్‌ రమణ కుమార్ ఈ ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 7వ తేదీన 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్వహించారు. మెరిట్ జాబితా, ర్యాంకుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles