AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘షాకింగ్ ఘటన.. ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన విద్యార్ధిని’ ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

కొన్ని విషయాలు మన కళ్లతో చూసినా ఒక్కోసారి ఎందుకో నమ్మలేం.. అటువంటి వాటిల్లో దెయ్యాలు కాన్సెప్ట్‌ ఒకటి. మన చుట్టూ ఎందరో తాము దెయ్యాలను చూశామని, వాటివల్ల బాధింపబడ్డామని చెబుతుంటారు. కానీ అవి వాళ్ల అభూత కల్పనలని మనం కొట్టిపారేస్తుంటాం. అలాంటివి స్వానుభవంలోకి వస్తేగానీ అది నిజమో.. అబద్దమో అర్ధం కాదు. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో..

Viral Video: 'షాకింగ్ ఘటన.. ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన విద్యార్ధిని' ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!
School Girl Possessed By Demon
Srilakshmi C
|

Updated on: May 03, 2024 | 3:43 PM

Share

పూణె, మే 2: కొన్ని విషయాలు మన కళ్లతో చూసినా ఒక్కోసారి ఎందుకో నమ్మలేం.. అటువంటి వాటిల్లో దెయ్యాలు కాన్సెప్ట్‌ ఒకటి. మన చుట్టూ ఎందరో తాము దెయ్యాలను చూశామని, వాటివల్ల బాధింపబడ్డామని చెబుతుంటారు. కానీ అవి వాళ్ల అభూత కల్పనలని మనం కొట్టిపారేస్తుంటాం. అలాంటివి స్వానుభవంలోకి వస్తేగానీ అది నిజమో.. అబద్దమో అర్ధం కాదు. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక స్కూల్‌ విద్యార్ధిని క్లాస్‌ రూంలో ఉన్నట్లుండి స్పృహ కోల్పోతుంది. ఆ విద్యార్ధిని చుట్టూ ఉన్న తోటి విద్యార్ధులు బాలికను పట్టుకున్నప్పటికీ.. కొన్ని సెకన్లపాటు గాల్లో తేలియాడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపూ మన కళ్లను మనమే నమ్మలేనంతగా ఆశ్చర్యపరుస్తుంది. అదే టైంలో భయం కూడా వేస్తుంది. నమ్మశక్యం కాకపోతే మీరే చూడండి..

ఈ వీడియోలో ఒక స్కూల్‌లోని తరగతి గదిలో నిలబడి ఉన్న ఓ విద్యార్ధి అపస్మారక స్థితిలో పడిపోతుండటం మనకు కనిపిస్తుంది. దీంతో చుట్టూ ఉన్న విద్యార్ధులు ఆమెను పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుంటారు. వాళ్ల చేతుల్లో ఉన్న ఆ విద్యార్ధి ఒక్కసారిగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. కాళ్లు చేతులు వేలాడుతూ స్పృహలో లేనప్పటికీ.. గాల్లో కొన్ని సెకన్లపాటు పాక్షికంగా వేలాడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న తోటి విద్యార్ధులు ఆమెను ఓ టేబుల్‌పై పడుకోబెట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను సుహిత్‌ జాదవ్‌ అనే యూజర్‌ రెడిక్ట్‌లో షేర్‌ చేశాడు.  ఈ వీడియోకు క్యాప్షన్‌ కూడా రాశాడు. అందులో.. ‘నేను పూణే వాసిని. ఈరోజు మా స్కూల్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆమె గాలిలో కొంతసేపు తేలియాడింది’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇది ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది అనే వివరాలను మాత్రం తన పోస్టులో ప్రస్తావించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Hey I am from Pune, India. Today a girl from my school was possessed by a demon. byu/Suhit_Jadhav inParanormalEncounters

ఇవి కూడా చదవండి

‘ఆమెకు తక్షణమే వైద్య సహాయం అవసరం.. లేదంటే అద్భుతంగా నటిస్తుందని అందరూ అనుకుంటారు’ అని ఒకరు, ‘ఆమె తను కూర్చున్న బెంచ్‌ నుంచి పైకి గాలిలో తేలింది. ఏ సపోర్ట్‌ లేకుండా గాలిలోకి లేచింది. అంటే దెయ్యం అని అననుగానీ మిస్టీరియస్‌గా ఉందని’ మరొకరు వ్యాఖ్యానించారు. ‘క్లాస్ బంక్‌ కొట్టడానికి స్టూడెంట్స్‌ చేసే ట్రిక్స్’ అని మరొక యూజర్‌ కొట్టిపారేశారు. సాధారణంగా నెట్టింట ఎన్నో ‘పారానార్మల్’ వీడియోలు హల్‌చల్‌ చేస్తుంటాయి. కానీ ఈ వీడియో పాతదే అయినా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ ఈ వీడియో చూస్తే మీకేం అనిపిస్తుంది..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.