PM Modi: ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..
ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 6, 8 తేదీల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. మే 6న మధ్యాహ్నం మూడు గంటలకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అక్కడినుండి చంద్రబాబు, పవన్‌లతో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగించనున్నారు.
రాజమండ్రిలో సభ అనంతరం సాయంత్రం 5.45 గంటల విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో కూడా చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. మే 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద ఏర్పాటుచేసి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మూడు సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని భద్రతాపరమైన చర్యలను చేపట్టారు పోలీసు అధికారులు.




