AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyper Aadi: నేను పిఠాపురంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా: హైపర్‌ ఆది

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శల దాడికి దిగుతున్నాడు. గురువారం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. దుర్గాడ గ్రామంలో రోడ్‌ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంట్లోనే మంచి చేయనివాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల, సునీత గుర్తించి రోడ్‌ షోలో..

Hyper Aadi: నేను పిఠాపురంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నా: హైపర్‌ ఆది
Hyper Aadi
Subhash Goud
|

Updated on: May 03, 2024 | 11:58 AM

Share

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శల దాడికి దిగుతున్నాడు. గురువారం పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. దుర్గాడ గ్రామంలో రోడ్‌ షోలో పాల్గొన్న ఆది సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంట్లోనే మంచి చేయనివాడు జనాలకు ఏం చేస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల, సునీత గుర్తించి రోడ్‌ షోలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యం పోవాలంటే కూటమిని గెలిపించాలని ఓటర్లు కోరాడు.

నేను పిఠాపురంలో పుట్టనందుకు బాధగా ఉంది

పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో తాను ఎందుకు పుట్టలేదని బాధగా ఉందని ఆది అన్నారు. ఒక వేళ పుఠాపురంలో పుట్టి ఉంటే బాగుండేదని, ఎందుకంటే పవన్‌ కల్యాణ్‌కు ఓటు వేసే అదృష్టం దక్కి ఉండేదని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి కూటమికి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చూడాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి అవుతుందని, పేద ప్రజల కష్టాలు తీరుతాయని ఆది పేర్కొన్నారు. మీ ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేయాలని కోరారు.

ఆదిలా ఉండగా పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ఎవరి వారు తమ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఇటుక కూటమి నేతలు, అటు వైసీపీ నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైనా తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, తాము చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇటు కూటమి పార్టీ నేతలు ఈ సారి తమదే అధికారమని, వైసీపీ పాలనతో జనాలు విసిగిపోయారని, కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్