Watch Video: ‘చంద్రబాబు సూపర్6 అంతా మోసం’.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్..
ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్. ఒకసారి అవకాశమిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న సీఎం.. లంచాలు, వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూర్ సెంటర్‌లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ మీటింగ్‌కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్. ఒకసారి అవకాశమిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న సీఎం.. లంచాలు, వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూర్ సెంటర్‌లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ మీటింగ్‌కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్‌ల పేరుతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబును ప్రజలు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు. తన హయాంలో వృద్దాప్య పెన్షన్, వసతి దీవెన, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, ఆరోగ్య శ్రీ, పేదలకు 31 లక్షల ఇళ్లపట్టాలు ఇలా అనేక సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ వివరించారు. వీటన్నింటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ గ్రామంలోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. నాడు-నేడులో భాగంగా కొత్త వైభవాన్ని తీసుకొచ్చిన పాఠశాలల నిర్మాణం గురించి ప్రస్తావించారు. అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశా యాప్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం తమదే అని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటి వరకు తాను చెప్పిన పథకాలు గతంలో ఎవరి హయాంలోనైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఇవన్నీ కొనసాగాలంటే తిరిగి మీ బిడ్డ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, తన పాలనలో ఏ రకమైన లబ్ధి చూకూరింటే తిరిగి మరోసారి ఆశీర్వదించమని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..