AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఛీ.. వీడసలు తండ్రేనా? ఏ శిక్ష వేసినా తక్కువే! గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి

అభంశుభం తెలియని ఆరేళ్ల బాలుడి పట్ల ఆ తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. బరువు ఎక్కువగా ఉన్నాడనే నెపంతో జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నరకం చూపించాడు. పసివాడిని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. బాలుడు పరుగెత్తుతున్న సమయంలో దాని వేగం మరింత పెంచి పైశాచిక ఆనందం అనుభవించాడు. దీంతో ఆ బాలుడు ఎన్నోసార్లు ట్రెడ్‌మిల్‌పై నుంచి కిందపడిపోవడంతో గుండె, లివర్‌తో సహా శరీరంలో పలు భాగాలు తీవ్రంగా..

Watch Video: ఛీ.. వీడసలు తండ్రేనా? ఏ శిక్ష వేసినా తక్కువే! గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
6 Year Old Boy Running On Treadmill
Srilakshmi C
|

Updated on: May 02, 2024 | 5:35 PM

Share

న్యూజెర్సీ, మే 2: అభంశుభం తెలియని ఆరేళ్ల బాలుడి పట్ల ఆ తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. బరువు ఎక్కువగా ఉన్నాడనే నెపంతో జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నరకం చూపించాడు. పసివాడిని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. బాలుడు పరుగెత్తుతున్న సమయంలో దాని వేగం మరింత పెంచి పైశాచిక ఆనందం అనుభవించాడు. దీంతో ఆ బాలుడు ఎన్నోసార్లు ట్రెడ్‌మిల్‌పై నుంచి కిందపడిపోవడంతో గుండె, లివర్‌తో సహా శరీరంలో పలు భాగాలు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బాలుడితో జిమ్‌లో పరిగెత్తిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌గా మారింది. కొడుకుని చంపిన నేరం కింద ఆ కిరాతక తండ్రి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దారుణ ఘటన అమెరికాలోని న్యూ జెర్సీలో వెలుగు చూసింది.

అమెరికాలోని న్యూ జెర్సీకి చెందిన గ్రెగర్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమారుడు కోరీని తీసుకుని 2021 మార్చి 20వ తేదీన అట్లాంటిక్ హైట్స్ క్లబ్‌హౌస్ ఫిట్‌నెస్ సెంటర్‌లోకి వెళ్లాడు. తొలుత బాలుడు కోరీ ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరిగెత్తడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రెగర్‌ దాని స్పీడ్‌ పెంచడంతో బాలుడు కింద పడిపోతాడు. ఆ తర్వాత తండ్రి గ్రెగర్‌ బాలుడిని బలవంతంగా కదులుతున్న ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలుడు పలుమార్లు కింద పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. అంత చిన్న పసివాడు అధిక బరువు ఉన్నాడని భావించిన తండ్రి గ్రెగర్‌ ఈ విధంగా జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై బాలుడితో రన్నింగ్‌ చేయించాడు. అంతేకాకుండా కోరి పరిగెత్తేటప్పుడు ట్రెడ్‌ మిల్‌ వేగం పెంచడంతో ఆ పసివాడు పదే పదే పడిపోవడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం బాలుడిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ మరుసటి రోజు కోరి అస్పష్టంగా మాట్లాడటం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లి బ్రె మిక్కియో ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది .అక్కడ చికిత్స పొందుతూ కోరి మృతి చెందాడు. పోస్టుమార్టం రిపోర్టులో తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్‌, సెప్సిస్‌తోపాటు కార్డియాక్‌ అరెస్ట్, లివర్‌ కంట్యూషన్‌ కారణంగా మరణించినట్లు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన సన్నివేశాలు జిమ్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాలుడి మృతిపై కోర్టుకెక్కిన తల్లి బ్రె మిక్కియోలో ఈ వీడియోను కోర్టుకు సమర్పించింది. దీంతో గ్రెగర్‌ను జులై 2021లో అరెస్ట్‌ చేశారు. ట్రెడ్‌మిల్‌పై అధిక సమయం పరిగెత్తడం, పలుమార్లు కిందపడిపోవడం వల్ల బాలుడి ఛాతీ, కడుపు భాగాలపై బలమైన గాయాలు అయ్యాయి. గుండె దెబ్బతినడంతోపాటు కాలేయం చీలిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన రెన్సిక్ పాథాలజిస్ట్ కోరీ మరణం హత్యగా నిర్ధారించింది. నిందితుడిని 2022, మార్చి 9న ఓషన్ సిటీ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. నేరం రుజువైతే కుమారుడిని హత్య చేసిన నేరం కింద గ్రెగర్‌కు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.