‘ఏడాదికోసారి 25 మంది వర్జిన్ అమ్మాయిలతో’.. కిమ్ మామలో ఈ యాంగిల్ కూడా ఉందా?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పరిపాలనా విధానం, వింత శిక్షలు, విధించే రూల్స్ అన్ని కూడా యావత్ ప్రపంచమంతా చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. కిమ్ లైఫ్ స్టైల్, క్రూరత్వం గురించి చెప్పుకోవాలంటే.. రెండు పార్టుల సినిమా తీయాల్సిందే.

'ఏడాదికోసారి 25 మంది వర్జిన్ అమ్మాయిలతో'.. కిమ్ మామలో ఈ యాంగిల్ కూడా ఉందా?
Kim Jong Un
Follow us

|

Updated on: May 02, 2024 | 1:01 PM

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పరిపాలనా విధానం, వింత శిక్షలు, విధించే రూల్స్ అన్ని కూడా యావత్ ప్రపంచమంతా చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. కిమ్ లైఫ్ స్టైల్, క్రూరత్వం గురించి చెప్పుకోవాలంటే.. రెండు పార్టుల సినిమా తీయాల్సిందే. ప్రతీ రోజూ కిమ్ మామ చిత్ర విచిత్రమైన క్రూరత్వ శిక్షలపై అనేక వార్తలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మరో ఆసక్తికరమైన వార్త ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కిమ్ మామలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకెళ్తే.. ఉత్తర కొరియాకు చెందిన యెవోమీ పార్క్ అనే యువతి.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఏటా కిమ్ జోంగ్ ఉన్.. 25 మంది వర్జిన్ అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటారని యెవోమీ పార్క్ తెలిపింది. అమ్మాయిల అందం, అలాగే వారి కుటుంబం ఏ పార్టీకి రాజకీయంగా విధేయత కలిగి ఉంది.? అలాగే ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్నారా.? లేదా.? దక్షిణ కొరియా లేదా ఇతర దేశాల్లో వీరికి బంధువులు ఉన్నారా.? అనే అంశాలను ఈ ఎంపికలో పరిగణనగా తీసుకుంటారని చెప్పింది. తానూ రెండుసార్లు సెలెక్ట్ అయినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేదంది.

ఎంపికైన 25 మందిని ‘ప్లెజర్ స్క్వాడ్’లోకి తీసుకుంటారు. ఇక ఈ స్క్వాడ్‌ను 3 గ్రూపులుగా విభజిస్తారని.. ఒక గ్రూప్ కిమ్‌కు మసాజ్ చేస్తుందని, మరో గ్రూప్ పాటలు, డ్యాన్సులతో అలరిస్తుందని వెల్లడించారు. మూడో గ్రూప్ కిమ్‌తో పాటు సన్నిహితులతో లైంగిక చర్యల్లో పాల్గొంటుందని పేర్కొంది. ఈ తతంగం మొత్తం ఇప్పటిది కాదని.. 1970లోనే కిమ్ జోంగ్ ఇల్ దీనిని మొదలుపెట్టారని యెవోమీ తెలిపింది. కిమ్ జోంగ్-ఇల్ మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్-సుంగ్‌ని సంతోషపెట్టడానికి, అలాగే అతడి వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ప్లెజర్ స్క్వాడ్‌ను రూపొందించాడని పార్క్ వివరించింది. (Source)

View this post on Instagram

A post shared by Yeonmi Park (@yeonmi_park)

Latest Articles