Telangana: సీసీ కెమెరాకు చిక్కిన దోపిడీ ముఠా.. ఇంతకీ ఏం దొంగిలించారో తెలుసా..?
ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పంప్ హౌజ్‌లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుల దోపిడీకి పాల్పడ్డారు. సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు, కత్తులతో బెదిరించి దొరికినకాడికీ దోచుకుని పారిపోయారు. దొంగతనాలలో మంచి ఎక్స్ట్‌పర్ట్స్‌లా బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పంప్ హౌజ్‌లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుల దోపిడీకి పాల్పడ్డారు. సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు, కత్తులతో బెదిరించి దొరికినకాడికీ దోచుకుని పారిపోయారు. దొంగతనాలలో మంచి ఎక్స్ట్‌పర్ట్స్‌లా బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు బెండల్స్ కాపర్ వైర్లు, కొంత ఇనుప రాడ్లు ఎత్తుకెళ్లారు. వారు చోరీకి పాల్పడ్డ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి..
పంప్ హౌజ్ సిబ్బంది ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం దేవాదుల పంపౌజ్ లో జరిగింది. అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు పంపు హౌజ్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న సెక్యూరిటీని కత్తులతో బెదిరించారు. పంపౌజ్ లోకి చొరబడి విలువైన కాపర్ వైర్ తో పాటు ఇతర సామాగ్రిని దోచుకెళ్ళారు.
పంప్ హౌస్ వద్ద అర్ధరాత్రి నిద్రలో ఉన్న సిబ్బందిని లేపిన ఐదుగురు గుర్తుతెలియని దుండగులు, కర్రలు, కత్తులతో బెదిరించారు. ఓ మంచంపై ఉన్న సిగరెట్లు తీసుకున్న ఇద్దరు దుండగులు.. ఎంచక్కా వాటిని వెలిగించుకున్నారు. అనంతరం వారిని పంప్ హౌస్‌లోకి తీసుకెళ్లి విలువైన వస్తువులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ముఠా కోసం వేట మొదలు పెట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…