Drinkers Association: మందు బాబులకు అన్యాయం చేస్తే సహించేది లేదు.. తాగుబోతుల సంఘం హెచ్చరిక..
ఒక వ్యక్తి డాబు దర్పంతో హుందాగా కారులో నుంచి హుందాగా దిగారు.. అతనికి అక్కడున్న వారంతా ఘనస్వాగతం పలికారు. ఆయన ఏ రాజకీయపార్టీ నాయకుడు కాదు. తాగుబోతుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొట్రంగి తరుణ్. ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసం కాదు.. ఆయనకు మందు బాబులు పలికిన స్వాగతం అదో రేంజ్.. ఎన్నికల వేళ వీళ్ళ హడావుడి ఏంటి..! లిక్కర్ దుకాణాలను తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆకస్మికంగా పరిశీలించి ఏం చేశాడో మీరే చూడండి...
ఒక వ్యక్తి డాబు దర్పంతో హుందాగా కారులో నుంచి హుందాగా దిగారు.. అతనికి అక్కడున్న వారంతా ఘనస్వాగతం పలికారు. ఆయన ఏ రాజకీయపార్టీ నాయకుడు కాదు. తాగుబోతుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొట్రంగి తరుణ్. ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసం కాదు.. ఆయనకు మందు బాబులు పలికిన స్వాగతం అదో రేంజ్.. ఎన్నికల వేళ వీళ్ళ హడావుడి ఏంటి..! లిక్కర్ దుకాణాలను తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆకస్మికంగా పరిశీలించి ఏం చేశాడో మీరే చూడండి…
నిండు వేసవిలో బీర్లు కొరత.. మరోవైపు సిండికేట్‌గా ధరలు పెంచి దోచుకుంటున్న వైన్స్ వ్యాపారులు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియుల పిర్యాదుల మేరకు తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాటారం మండల కేంద్రంలోనీ తెలంగాణ వైన్స్, శ్రీనివాస వైన్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాగుబోతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్ ఇలాంటి వైన్స్ దోపిడీ వల్ల తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రెండు వైన్స్‌లు పక్క పక్కనే బెట్టి, బెల్ట్ షాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులకు నిత్యం ముడుపులు ముడుతున్నట్లు మాకు సమాచారం ఉందని ఆరోపించారు..విద్యా సంస్థలకు అత్యంత సమీపంలో వైన్స్ షాప్ నిర్వహిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తరుణ్ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లైట్ బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మనోళ్ల తిప్పలు మాములుగా లేవని డిమాండ్ కు తగిన లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్ కు ఘనంగా స్వాగతం పలికిన మద్యం ప్రియులు ఆయనతో కలిసి బీర్ల కోసం ధర్నాకు దిగారు. అన్ని వైన్స్ షాప్‌ల్లో లైట్ బీర్ లు అమ్మకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు ఉంటాయని హెచ్చించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…