AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Model Murder Case: ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. నిమిషాల వ్యవధిలో మోడల్‌ దారుణ హత్య!

ఓ బ్యూటీ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఏకంగా ఆమె ప్రాణాలకే ఎసరు పెట్టింది. ఆమెను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో గాలిస్తున్న నేరస్తులకు ఆమె అడ్రస్ ఇచ్చినట్లైంది. ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే హంతకులు ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని తుపాకులతో కాల్చి చంపారు. ఈ షాకింగ్‌ ఘటన ఈక్వెడార్‌లో చోటు చేసుకుంది..

Model Murder Case: ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. నిమిషాల వ్యవధిలో మోడల్‌ దారుణ హత్య!
Ecuadorian Beauty Queen Landy Parraga Goyburo
Srilakshmi C
|

Updated on: May 05, 2024 | 4:56 PM

Share

ఓ బ్యూటీ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఏకంగా ఆమె ప్రాణాలకే ఎసరు పెట్టింది. ఆమెను అంతమొందించేందుకు ఎప్పటి నుంచో గాలిస్తున్న నేరస్తులకు ఆమె అడ్రస్ ఇచ్చినట్లైంది. ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే హంతకులు ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని తుపాకులతో కాల్చి చంపారు. ఈ షాకింగ్‌ ఘటన ఈక్వెడార్‌లో చోటు చేసుకుంది.

2022 మిస్ ఈక్వెడార్ పోటీలో పాల్గొన్న లాండీ పర్రాగా గోయ్‌బురో (23) ఈ ఏడాది ఏప్రిల్ 28న క్యూవెడో నగరంలోని రెస్టారెంట్‌లో హత్యకు గురయ్యారు. ఆమె ఓ మ్యారేజ్‌ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లగా.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ బ్యూటీ మరణానికి కొన్ని నిమిషాల ముందు తాను రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ ద్వారా అడ్రస్‌ కనుక్కున్న ఇద్దరు హంతకులు నిమిషాల వ్యవధిలోనే రెస్టారెంట్‌కు చేరుకున్నారు. అక్కడ గోయ్‌బురో ఓ వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఒకరు ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉండగా.. మరొకరు ఆమె వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి తుపాకితో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గోయ్‌బురోతోపాటు ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తికి కూడా బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్‌ సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. కాగా లాండీ పరాగా మిస్‌ ఈక్వెడార్‌ కంటెస్టెంట్‌లలో ఒకరు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ కూడా. ఈ బ్యూటీకి మాదకద్రవ్యాల డీలర్‌ లియోనార్డో నోరెరోతో అఫైర్‌ ఉన్నట్లు సమాచారం. అతడు ఇచ్చిన విలాసవంతమైన బహుమతులే ఇందుకు సాక్ష్యాలుగా నిలిచాయి. డ్రగ్స్‌ డీలర్‌ నోరెరో ఫోన్‌లో లాండీ పరాగా పేరు ఉండటంతో పాటు వీరి సంభాషణలు, చాటింగ్‌కు సంబంధించిన విషయాలు 2023లో వెలుగులోకి వచ్చాయి. ఓ కేసు విషయమై కోర్టులో అతడిని విచారిస్తున్న సందర్భంలో తనకు, మోడల్‌ లాండీ పరాగాకు ఉన్న సంబంధం గురించి బయట పెట్టొద్దని లాయర్లను వేడుకున్నాడు. అయితే గతేడాది జైల్లో జరిగిన ఓ ఘటనలో డ్రగ్స్‌ డీలర్‌ నోరెరో హత్యకు గురయ్యాడు. నోరెరో భార్యే అతడిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.