CM KCR Birthday: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. డీహెచ్ శ్రీనివాసరావు సర్క్యూలర్
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. అంతకుముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ డీహెచ్ శ్రీనివాసరావు.. తాజాగా ఆయన విడుదల చేసిన సర్క్యులర్ చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. అంతకుముందు పలు కరోనా గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డ డీహెచ్ శ్రీనివాసరావు.. తాజాగా ఆయన విడుదల చేసిన సర్క్యులర్ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు (ఫిబ్రవరి 17) సందర్భంగా.. శుక్రవారం వైద్యఆరోగ్య శాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ డీహెచ్ శ్రీనివాసరావు సర్క్యులర్ విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీల ఆవరణలో రేపు మొక్కలు నాటాలని సర్క్యూలర్లో కోరారు. దీంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని.. రోగులకు పండ్లు పంచిపెట్టాలని ఆదేశిస్తూ సర్క్యులర్ విడుదల చేశారు. కాగా, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరపాలని డిహెచ్ శ్రీనివాస్ రావు అధికారికంగా సర్కులర్ జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు పార్టీల నేతలు కూడా విమర్శలు వ్యక్తంచేస్తున్నారు.
కాగా, అంతకుముందు కూడా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.. మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ, తదితర అంశాలను కూడా ఆయన అప్పట్లో మాట్లాడటం చర్చనీయాంశమైంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..