మా ఊరు పేరు మార్చండి బాబోయ్.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గ్రామస్థులు
కొన్ని ఊర్ల పేర్లు.. వింటే ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఊరు పేరు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచార, వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయి. అయితే ఆ గ్రామం పేరు చెపితే చాలు అక్కడి స్థానికులకు చెప్పుకోలేనంతా బాధగా ఉంటుందంట. స్థానికులకే.. కాదు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ ఊరు పేరును పలకడానికి ఇబ్బందిపడతారు.

కొన్ని ఊర్ల పేర్లు.. వింటే ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఊరు పేరు చెప్పగానే అక్కడి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచార, వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయి. అయితే ఆ గ్రామం పేరు చెపితే చాలు అక్కడి స్థానికులకు చెప్పుకోలేనంతా బాధగా ఉంటుందంట. స్థానికులకే.. కాదు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ ఊరు పేరును పలకడానికి ఇబ్బందిపడతారంటా.. ఆ గ్రామమే కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని లంజగూడ.. పేరు పలకగానే ఇదేంటి ఇంత దారుణంగా ఉంది.. ఈ పేరు ఎలా పెట్టారని ఆలోచిస్తున్నారు కదా.. అక్కడి ప్రజలు కూడా అంతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇరవై ఏళ్ల క్రితమే తమ ఊరు పేరును నందిగూడగా మార్చుకున్నా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మారకపోవడంతో విద్యా, ఉద్యోగ, ఆధార్ సర్టిఫికేట్లలో ఆ లం… గూడ పేరునే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆ గ్రామస్థులు..
ఇదే విషయాన్ని ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తడంతో ఆ ఊరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ లం…గూడ పేరిటనే జారీ అవుతున్నాయని… ఏదైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు మీది ఏ ఊరు అని అడిగితే ఊరు చెప్పుకునేందుకు అవమానకరంగా ఉంటోందని అక్కడి ప్రజలు వాపోతున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా గుర్తు చేశారు ఎమ్మెల్యే పాల్వాయి..
వీడియో చూడండి..
పలకలేని ఊరు పేరుతో కష్టాలు పడుతున్నాం.. నా నియోజక పరిదిలోని ఆ ఊరు పేరును మార్చాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజక వర్గంలోని కాగజ్ నగర్ మండల సమీపంలో ఉన్న ల..జగూడ అనే ఊరు పేరు మార్చాలని.. ఇరవై ఏళ్ల క్రితమే గ్రామస్తులు నందిగూడ అని పేరు మార్చుకున్నారని.. రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్చాలని కోరుతున్నామని కోరారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
తమ ఊరు పేరును గౌరవంగా చెప్పుకునేలా నందిగూడగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని.. అసలు ఆ పేరును పలకలేకపోతున్నామని.. లం.. గూడగా ఎవరు పెట్టారో కూడా తెలియదని ఆ గ్రామస్తులు చెపుతున్నారు. తాము ఎక్కడికి వెళ్లినా గ్రామం పేరు చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నామని.. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ లం..గూడ గానే ఉందని చెపుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రామం పేరును మార్చాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
