NABARD Jobs 2026: కళ్లు చెదిరే జీతంతో నాబార్డులో ఉద్యోగాలు.. మరో వారంలో ముగుస్తున్న దరఖాస్తులు
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి యువ, అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లైమేట్ యాక్షన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో..

దేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి యువ, అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లైమేట్ యాక్షన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో యువ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే నాబార్డ్ చేపట్టే ఈ నియామకాలు శాశ్వతం కాదు. కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తుంది. ఎంపికైన అభ్యర్థులను ప్రారంభ దశలో ఏడాది పాటు విధుల్లోకి తీసుకుంటారు. వీరి పనితీరు ఆధారంగా ఈ కాలాన్ని మరో 3 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ కింద నాబార్డ్ మొత్తం 44 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎకనామిక్స్, డేటా సైన్స్, సైబర్ భద్రత, విద్యా పరిపాలన, గ్రాఫిక్ డిజైనింగ్, పిఆర్, ఔట్రీచ్ డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జియోఇన్ఫర్మేటిక్స్, ఫైనాన్స్, UI/UX డిజైనింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టులను బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వేర్వేరు అర్హతలు కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది పాటు అనుభవం కూడా ఉండాలి. నాబార్డ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 21సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 12, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి రుసుము చెల్లించాలి. ప్రతి ఒక్కరూ రూ. 150 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఎంత జీతం వస్తుంది?
నాబార్డ్‌లో ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి నెలకు రూ. 70 వేల వరకు జీతం పొందవచ్చు. ఈ జీతం అనుభవం, పోస్టు బాధ్యతల ఆధారంగా నిర్ణయించబడుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఈ ప్యాకేజీకి అధిక డిమాండ్ ఉంది.
ఎలా ఎంపిక చేస్తారంటే?
ఈ పోస్టులకు అభ్యర్థుల విద్యార్హతలు, అప్లికేషన్ స్క్రీనింగ్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలో అభ్యర్థి అనుభవం, పని శైలి, వృత్తిపరమైన నైపుణ్యాలను పరిశీలిస్తారు.
నాబార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




