CUET UG 2026 Exam Dates: సీయూఈటీ యూజీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
దేశంలోని 48 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు..

హైదరాబాద్, జనవరి 6: దేశవ్యాప్తంగా ఉన్న 48 సెంట్రల్ యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈసారి జరిగే సీయూఈటీ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల తేదీలను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను మే 11 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఎన్‌టీఏ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 03 నుంచే మొదలైంది. జనవరి 30, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా.. ఈ 13 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
జనవరి 7న తెలంగాణ సెట్స్ ప్రవేశ పరీక్షల కన్వీనర్ల సమావేశం.. ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. సెట్స్ కన్వీనర్ల సమావేశం జనవరి 7వ తేదీన అంటే బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి సమక్షంలో జరగనుంది. మే నెలలో జరిగే మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించవల్సిన సౌకర్యాలు వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




