AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Jobs 2026: రాత పరీక్షలేకుండానే ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1,77,500 వరకు జీతం

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కింది అర్హతలు కలిగిన పురుష అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో ఈ రోజును దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చే నెల 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

Indian Army Jobs 2026: రాత పరీక్షలేకుండానే ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.1,77,500 వరకు జీతం
Indian Army SSC Tech 67th men Recruitment
Srilakshmi C
|

Updated on: Jan 07, 2026 | 2:46 PM

Share

ఇండియన్‌ ఆర్మీలో 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కోర్సులో ప్రవేశాలకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 350 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. అర్హత కలిగిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఎస్‌ఎస్‌సీ టెక్‌ 67 పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి 2026 అక్టోబర్‌ నుంచి కోర్సు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు బుధవారం నుంచి అంటే జనవరి 7, 2026వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌) 67 కోర్సు.. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఎంఐఎస్సీ వంటి పలు ఇంజినీరింగ్‌ విభాగాల్లో అందిస్తారు. ఇది ఏడాది పాటు ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2026 అక్టోబర్‌ 1కి ముందు డిగ్రీ పూర్తిచేయనున్ను ఇంజనీరింగ్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధుల ఫిజికల్ స్టాండర్డ్స్ నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా 10.30 నిమిషాల్లో 2.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాలి. అలాగే పుష్-అప్స్ 40, పుల్-అప్స్ 6, సిట్‌ అప్స్‌- 30 చేయాలి. స్విమ్మింగ్‌లో కనీసం నైపుణ్యం ఉండాలి.

అభ్యర్ధుల వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1 అక్టోబర్‌ 1999 నుంచి 30 సెప్టెంబర్‌ 2006 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులన్నమాట. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5, 2026వ తేదీ వరకు దరఖాస్తుకు అర్హత ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్టింగ్ చేసి, గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఫిజికల్ స్టాండర్డ్స్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారన్నమాట. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత విధులు చేపట్టిన వారికి నెలకు రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!