ఏది నకిలీ.. ఏది అసలు..! గుర్తు పట్టేదేలా..? బ్రాండెడ్ కంపెనీల పేరుతో భారీ మోసాలు..!
బ్రాండెడ్ కంపెనీల పేరుతో జరుగుతున్న ఘరానా మోసాలపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. వరంగల్ నగరంలో బ్రాండెడ్ కంపెనీల పేరుతో విక్రయాలు జరుపుతున్న నకిలీ వస్త్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక బ్రాండెడ్ కంపెనీల వస్త్ర వ్యాపారులు హైకోర్టు ఆదేశాలతో పోలీసులను ఆశ్రయించడంతో లీగల్ టీమ్ తో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు. బారీ ఎత్తున నకిలీ వస్త్రాలు స్వాదీనం చేసుకున్నారు.

బ్రాండెడ్ కంపెనీల పేరుతో జరుగుతున్న ఘరానా మోసాలపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. వరంగల్ నగరంలో బ్రాండెడ్ కంపెనీల పేరుతో విక్రయాలు జరుపుతున్న నకిలీ వస్త్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక బ్రాండెడ్ కంపెనీల వస్త్ర వ్యాపారులు హైకోర్టు ఆదేశాలతో పోలీసులను ఆశ్రయించడంతో లీగల్ టీమ్ తో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు. బారీ ఎత్తున నకిలీ వస్త్రాలు స్వాదీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులే ఇలాంటి దందాలకు పాలపడుతూ.. దగా చేస్తున్నారంటున్న స్థానిక వ్యాపారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏది నకిలీ.! ఏది అసలు.! తెలుసుకోవడం అసాధ్యంగా మారింది. బ్రాండెడ్ కంపెనీల పేరుతో జరుగుతున్న నకిలీ బ్రాండ్ వ్యాపారాలు అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పేరు మోసిన కంపెనీలను కూడా మోసం చేస్తున్నాయి. నకిలీ వస్త్ర వ్యాపారాలు, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు, మెకానికల్ వ్యాపారాలు, కాస్మోనిక్స్ కూడా నకిలీ దందా అడ్డుఅదుపు లేకుండా జరుగుతుంది. పేరు మోసిన కంపెనీల పేరుతో జరుగుతున్న నకిలీ బ్రాండ్ వస్త్ర వ్యాపారులపై కొన్ని కంపెనీలు చట్ట పరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ లో పలు వస్త్ర దుకాణాలపై డిల్లీకి చెందిన లీగల్ టీమ్ తో హై కోర్టు ఆదేశాలతో వరంగల్ పోలీసులను ఆశ్రయించారు.. వారితో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు.. బారీ ఎత్తున నకిలీ వస్త్రాలు సీజ్ చేశారు.
అయితే బ్రాండెడ్ కంపెనీ పేరుతో జరుగుతున్న నకిలీ బ్రాండ్ వ్యాపారాలపై స్థానిక వ్యాపారులు బగ్గుమంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి బ్రతుకుతెరువు కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చిన కొంతమంది వ్యాపారులు ఇలాంటి నకిలీ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారని, వారి వల్లే ప్రజలకు వస్త్ర వ్యాపారాలు ఎలక్ట్రానిక్ పరికరాలు, కాస్మోటిక్స్ వ్యాపారాలపై నమ్మకం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ బట్టల బజార్ వర్తక సంఘం నకిలీ వస్త్ర వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 60 సంవత్సరాల నుండి వస్త్ర వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందామని, నాలుగైదు సంవత్సరాల క్రితం వచ్చిన ఇతర రాష్ట్రాల వ్యాపారాలు నకిలీ బ్రాండ్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ బ్రాండ్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
