Apples: రోజుకో యాపిల్ తింటే ఎన్నో బెనిఫిట్స్ అనుకుంటున్నారా..? పోతారు జాగ్రత్త..!
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే బెండకాయలు, ఆపిల్స్‌పై రసాయనాలు, స్ప్రేలు వాడుతున్నారని ప్రముఖ ఆర్గానిక్ వ్యవసాయదారుడు సతీష్ బాబు గద్దె వెల్లడించారు.బ్రోమైడ్ వంటివి కూరగాయలు, పండ్లపై ఉపయోగించి తాజాగా కనిపించేలా చేస్తున్నారని తెలిపారు. ఈ పద్ధతులు వినియోగదారుల ఆరోగ్యానికి హానికరం అని ఆయన హెచ్చరించారు.

ఆహార కల్తీ ప్రస్తుత సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగా మారింది. పాలు, కూరగాయలు, పండ్ల వంటి నిత్యవసర వస్తువులలో రసాయనాల వాడకం గురించి ప్రముఖ ఆర్గానిక్ వ్యవసాయదారుడు సతీష్ బాబు గద్దె ఇటీవల వివరించారు. పశువులకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల అవి మనుషుల ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో ఆయన ప్రశ్నించారు. పాలు వంటి ఉత్పత్తులకు వినియోగదారులు తక్కువ ధర చెల్లించడానికి మొగ్గు చూపడం వల్ల, ఉత్పత్తిదారులు అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకు అధిక ధర ఉంటే, ఉత్పత్తిదారులు సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కూరగాయల విషయంలో, బెండకాయలను ఉదాహరణగా తీసుకున్నారు. గతంలో ముదిరిన బెండకాయలు విరిస్తే విరిగిపోకపోయేవని, కానీ ఇప్పుడు మార్కెట్‌లో ఎంత లావుగా ఉన్నా అన్ని బెండకాయలు లేతగా, తాజాగా కనిపిస్తాయని తెలిపారు. దీనికి కారణం కోసే ముందు వాటిపై ఒక రకమైన స్ప్రే చేయడం అని ఆయన వెల్లడించారు. ఈ స్ప్రే చేసిన తర్వాత ముదిరిన బెండకాయలు కూడా లేతగా మారి, సులువుగా విరిగిపోతాయని వివరించారు. ఈ ప్రక్రియలో స్ప్రే చేసిన బెండకాయలు ఒక రోజు తర్వాత కోసి, హోల్‌సేల్‌కు, ఆపై రిటైల్‌కు వస్తాయని, అప్పటికే వాటిలో రసాయనాలు ఇమిడి ఉంటాయని ఆయన హెచ్చరించారు.
పండ్ల విషయానికి వస్తే, ఆపిల్స్‌ను ఉదాహరణగా చూపారు. పోలాండ్ నుంచి ఒక నెల రోజుల ప్రయాణం తర్వాత కూడా చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆపిల్స్ పాడవకుండా తాజాగా ఉన్నాయని ఆయన స్నేహితుడు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇవి మన లోకల్ మార్కెట్లకు వచ్చి, వినియోగదారుల ఇళ్లలొ కూడా ఐదారు రోజులు తాజాగా ఉంటాయని అన్నారు. దీనికి కూడా కూరగాయలపై వాడే రసాయనాల లాంటి స్ప్రేలే కారణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, కూరగాయలు, పండ్లపై వాడే రసాయనాలలో “బ్రోమైడ్” ఒకటి అని ఆయన స్పష్టం చేశారు. ఎలుకలను చంపడానికి వాడే బ్రోమైడ్ రసాయనాన్ని కూరగాయలు, పండ్లపై కొడుతున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి ఒక చిన్న ప్రయోగాన్ని సూచించారు: ఇంట్లో ముదిరిన బెండకాయలపై బ్రోమైడ్ స్ప్రే చేసి చూస్తే అవి లేతగా మారతాయని అన్నారు. ఆపిల్స్‌కు కూడా బ్రోమైడ్ లేదా దానికి దగ్గరగా ఉండే రసాయన ఫార్ములాను ఉపయోగిస్తున్నారని ఆయన వివరించారు. ఈ రసాయనాల వాడకం వల్ల మనం రోజువారీగా ఎంత విషాన్ని లోపలికి తీసుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చని సతీష్ బాబు గద్దె తెలియజేశారు.
