జీవితంలో దైర్యం నింపే పాట.. ఈ సాంగ్ విని సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనే మానేశారట..
తెలుగులో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేసేలా ఎంతో మంది గేయ రచయితలు అద్బుతమైన పాటలను రచించి అలరించారు. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కొత్తగా చెప్పాలా.. తెలుగు పాటలకు సరికొత్త హంగులు దిద్దిన రచయిత ఆయన..

జనల జీవితం పై సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. చాలా మంది సినిమాల వల్ల ప్రభావితం అవుతుంటారు. ఎంతో మంచి సినిమాల వల్ల మారారు. ఓ హీరోని లేదా ఓ హీరోయిన్ ను ఇన్‌స్ప్రేషన్ గా తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. కేవలం సినిమాలతోనే కాదు సాంగ్స్ ద్వారా కూడా ఎంతో మంది స్పూర్తిని పొందుతుంటారు. అలాంటి పాటలు మన తెలుగులో వేలల్లో ఉన్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ పాట వింటే జీవితానికి సరిపడ దైర్యం వస్తుంది. అంతే కాదు ఓ అభిమాని ఈ పాట విని తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆలోచనను మానుకున్నా అని చెప్పాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఆ పాట.. ఎంతో మందిలో స్పూర్తి నింపింది. ఇంతకూ ఆ సాంగ్ ఏంటో చూద్దామా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి.. !
విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయం రా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..!!
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ..
దేహముంది ప్రాణముంది, నెత్తురుంది సత్తువుంది, ఇంతకన్నా సైన్యముండునా…
ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్నా సారధి ఎవరురా..!
నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా.. నిన్ను మించి శక్తి ఏది నీకె నీవు బాసటైతే..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం.. అప్పుడే నీ జయం నిశ్చయం రా..!!
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గూవ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా..
పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా..
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అతిక్రమించరా.. విక్రమా పరాక్రమించరా.., విశాల విశ్వమాక్రమించరా.. జలధి సైతమాపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా..!!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
