Mana Shankara VaraPrasad Garu: గ్రాండ్‌గా మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి నామస్మరణతో టాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారింది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులనే కాదు, సినీ అభిమానుల గుండెల్ని కూడా షేక్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జనవరి 12న గ్రాండ్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి విడుదల సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.
అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి లుక్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. చాలా కాలం తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూసి ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో మెగాస్టార్ కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చూపించారు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా చూడాల్సిన సినిమాగా అనిల్ ఈ సినిమాను తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ
అంతే కాదు మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ గెస్ట్ గా దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి అదరగొట్టనున్నారు. ఈ ఇద్దరికీ సంబంధించిన సాంగ్ కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ఎలాంటి ఆసక్తికర విషయాలను పంచుకుంటారో చూడాలి..
విలన్ రామిరెడ్డి క్యాన్సర్ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




