08 January 2026
అప్పట్లో జయం సినిమాను మిస్సైంది.. ఇప్పుడేమో బుల్లితెరపై యాంకర్‌గా..
Rajitha Chanti
Pic credit - Instagram
నితిన్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.
ఇందులో నితిన్ సరసన సదా కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే నితిన్, సదా తమ సినీ ప్రయాణం స్టార్ చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి ఈ సినిమాలో నితిన్ సరసన నటించాల్సిన బ్యూటీ సదా కాదు.. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఛాన్స్ మిస్సైన అందాల రాశి ఎవరంటే..
ఇప్పుడు ఆమె బుల్లితెరపై క్రేజీ యాంకరమ్మగా వర్క్ చేస్తుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం సంపాదించుకుంది.
ఆమె మరెవరో కాదండి యాంకర్ రష్మీ గౌతమ్. ఈ సినిమాకు రష్మీతో కలిసి రిహార్సిల్స్ చేశారట నితిన్. 90 శాతం రష్మీతోనే రిహార్సిల్స్ చేశారట.
అయితే ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేశారట. దాంతో రష్మీ ప్లేస్ లోకి సదా వచ్చిందని చెప్పుకొచ్చారు నితిన్.
ఒకవేళ జయం సినిమా రష్మీ ఖాతాలో పడి ఉంటే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అయ్యేది అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం యాంకర్ గా చేస్తుంది.
హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది రష్మీ. అలాగే సహయ నటిగా కనిపించింది. ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్