AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Side Effects: మటన్ తిన్నాక ఇవి తింటే మటాషే.. పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకండి!

నాన్‌వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆదివారం వచ్చిందంటే చాలా ఇంట్లో చికెన్, లేదా మటన్ ఉండాల్సింది. కొందరైతే వారంలో మూడు నాలుగు రోజులు నాన్‌వెజే తింటుంటారు. ముఖ్యం మటన్‌ను తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరమైనప్పటికీ.. దాన్ని సరైన విధానంలో తినకపోతే హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును మటన్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తింటే అది మన ఆరోగ్యంపై ప్రతి కూడా ప్రభావాన్ని చూపుతుందట. ఇంతకు అవేంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jan 08, 2026 | 12:26 PM

Share
రాబోయేది సంక్రాంతి పండుగ సీజన్ ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్, మటన్ ఉండడం కామన్. హైదరాబాద్‌ హాస్టల్‌లో చప్పటి కూరలు తిని విసిగిపోయిన చాలా మంది సంక్రాంతి ఇంటికెళ్లి మంచిగా చికెన్, మటన్ తినాలి అనుకుంటారు. అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన తినే ఆహారంపైనే మన ఆరోగ్యం అనేది ఆధార పడి ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, వాటిని సరైన పద్దతిలో తింటున్నామా లేదా కూడా తెలుసుకోవాలి.

1 / 6
ముఖ్యంగా చికెన్, లేదా మటన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలు తిన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అజీర్ణం, మంట, గ్యాస్, చర్మ సమస్యల వంటి వాటికి దారి తీస్తాయి. మటన్‌లో ప్రోటిన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోవడం నివారించాలి. లేదంటే అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

2 / 6
కొంతమంది మటన్ లేదా చికెన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలు తిన్న వెంటనే పాలు, పెరుగు, లేదా మజ్జిగ తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నాన్‌వెజ్ తిన్న తర్వాత వీటిని తింటే జీర్ణక్రియ మందగిస్తుందని, కడుపు ఉబ్బరం, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 6
 మటన్ తిన్న తర్వాత తేనె తినడం కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. తేనెకు శరీరంలో వేడిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఇవి మటన్‌తో కలిసినప్పుడు శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. ఈ కారణంగా గుండెల్లో మంట, అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి మటన్ తిన్న తర్వాత తేనె తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.

4 / 6
అవే కాదు మటన్ తిన్న తర్వాత అరటిపండు, స్వీట్లు వంటి వాటిని కూడా తీసుకోవద్దట. మనం తిన్న మటర్ జీర్ణం అవడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే ఇవి తింటే కడుపులో సమస్య ఏర్పడి, మీకు ఇబ్బంది కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు మటన్‌తో భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని ఏవైనా తినాలి అనుకుంటే తినొచ్చు..

5 / 6
 అలాగే రాత్రి పూట మటన్ తినడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మీరు మటన్ తిన్న వెంటనే సరైన మోతాదులో నీరు తాగడం ఎంతో ముఖ్యం, ఒక వేళ మీకు తిన్న తర్వాత కడుపు భారంగా అనిపిస్తే అల్లం లేదా మెంతుల కషాయం వంటివి తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. (NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

6 / 6
'జోన్ జీరో' అంటే ఏమిటి? తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఇలా!

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా

హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్

ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?

హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!

వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..

మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?