Kamareddy District: కామారెడ్డి జిల్లా ధర్మారావుపేటలో కుల పెద్దల మాటను ధిక్కరించినందుకు ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వృద్ధురాలి అంత్యక్రియలకు కుమార్తె హాజరు కావడాన్ని వ్యతిరేకించిన పెద్దలు, ఆమెకు సహకరించిన వారిపై వేటు వేశారు. సహకరిస్తే రూ.5000 జరిమానా విధించారు. బాధితులు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.