Telangana: కొడుకు కాదు కిరాతకుడు.. కన్న తండ్రినే కడతేర్చాడు.. కారణం తెలిస్తే..
పైసా పైసా ఏం చేస్తావు అంటే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెడతా అందట.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే పెద్దలు చెప్పిన ఈ మాటలే నిజం అన్పిస్తున్నాయి. ఎందుకంటే డబ్బు మోజులో పడి కొందరు దుర్మార్గులు రక్తబంధాలను తెంచుకుంటున్నారు. కన్నవారని, తోడబుట్టిన వారని కూడా చూడకుండా కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.

డబ్బుపై మోజుతో ఓ కొడుకు కన్న తండ్రినే హత్య చేసిన ఘటన మొదక్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పాపన్న పేట (మం) సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు ఓ లైన్‌మెన్ వద్ద ప్రైవేటు సహాయకుడిగా పని చేస్తున్నాడు. లక్ష్మయ్యకు భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పెద్దకుమారుడు శ్రీకాంత్ వివాహాం, వ్యవసాయం కోసం పొలం వద్ద వేసిన బోర్లు కారణంగా తండ్రి అప్పులు పాలయ్యాడు. ఇదిలా ఉండగా అటు పెద్ద కొడుకు శ్రీకాంత్ సైతం తరచూ తనకు డబ్బులు కావాలని తండ్రి లక్ష్మయ్యతో గొడవపడేవాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని తండ్రిని బెదిరించిన దాఖాలు కూడా ఉన్నట్టు శ్రీకాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి.
అయితే సోమవారం రాత్రి లక్షయ్య ఇంటికి రాగా,ఆయను కుమారుడు మళ్లీ డబ్బులు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ సుత్తితో తండ్రి పై దాడి చేశాడు. గమనించిన తల్లి అడ్డు వచ్చి శ్రీకాంత్ చేతిలో ఉన్న సుత్తి లాక్కుంది. దీనితో అక్కడే ఉన్న కర్రతో మళ్లీ తండ్రిపై దాడి చేశాడు శ్రీకాంత్. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య.. హాస్పిటల్‌కు తరలించేలోపే మృతి చెందాడు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
