JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
JEE Main 2026 City Intimation Slip Released: ఈఈ మెయిన్ 2026 తొలి విడత ఆన్‌లైన్ రాత పరీక్షలు మరో 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (జనవరి 8) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో

హైదరాబాద్, జనవరి 8: దేశవ్యాప్తంగా ఉన్నఎన్‌ఐటీల్లో 2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఆన్‌లైన్ రాత పరీక్షలు మరో 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (జనవరి 8) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి పరీక్షకు సంబంధించిన సిటీ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే సిటీ సింటిమేషన్ స్లిప్‌లో కేవలం పరీక్ష కేంద్రం ఏ నగరంలో వస్తుందనే విషయం మాత్రమే ఉంటుంది. పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం వివరాలు ఇందులో వెల్లడించారు. ఆ వివరాలు జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత మాత్రమే తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి సరిగ్గా 4 రోజుల ముందు మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాతారు.
కాగా జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షలు జనవరి 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయి. పేపర్ 1 పరీక్ష బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష బీఆర్క్, బీ ప్లానింక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున జరుగుతాయి. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పేపర్ 2 పరీక్ష జనవరి 29వ తేదీన ఉదయం సెషన్‌లో 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే ఒకే సెషన్‌లో జరుగుతుంది.
ఈ ఏడాది 2026 జనవరి జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు మొత్తం 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఇక ఈ ఏడాదికి చివరి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ ఉంటాయి. అభ్యర్ధులు రెండు సెషన్లకు హాజరుకావచ్చు. ఈ రెండు సెషన్లలో బెస్ట్ స్కోర్‌ను మాత్రమే అంతిమంగా తీసుకుంటారు. జేఈఈ మెయిన్‌లో మొదటి 2.50 లక్షల ర్యాంకర్లకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. ఇతర వివరాలకు ఈ కింద లింక్‌పై క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్-2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




