Property Tax: హైదరాబాదీలకు బంపర్ ఆఫర్.. ఇంటి పన్ను వడ్డీపై 90శాతం డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే!
GHMC Property Tax OTS: హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీతో జీహెచ్ఎంసీ వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం మరికొన్ని రోజులు పాటు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి చేసేకోవాలని సూచించింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం 2025–26ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుందని పేర్కొంది. ఈ పథకం ప్రకారం, పన్ను చాలా రోజులుగా ఇంటి బకాయిలను చెల్లించని వారు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్‌తో పాటు కేవలం 10 శాతం వడ్డీని ఒక్కసారి చెల్లిస్తే, మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుంది స్పష్టం చేసింది. దీని ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది.
నగరంలోని పౌరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. OTS పథకం కింద చెల్లింపులు MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSCs), ఆన్‌లైన్ విధానాల ద్వారా చేయవచ్చని పేర్కొంది. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
