Andhra: ఇలాంటి పోలీస్‌ను ఎక్కడా చూసుండరు.. స్పీకర్ మెచ్చిన ఎస్ఐ గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!
పోలీస్ శాఖలో పనిచేస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని సంతృప్తిగా నిర్వహించడమే కాకుండా.. ప్రవృత్తిగా సేవాపథంవైపు అడుగులు వేస్తున్నారు అనకాపల్లి జిల్లా నాతవరం ఎస్ఐ తారకేశ్వరావు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లలో జన్మించిన తారకేశ్వరరావు తండ్రి ఏఆర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. చిన్నతనం నుంచి తారకేశ్వరరావుకు క్రీడలపై మక్కువ.

పోలీస్ అనగానే.. ఖాకీ డ్రెస్సు… చేతిలో లాఠి నెత్తిన టోపీ.. అంతకుమించి కఠినంగా వ్యవహరిస్తారన్న ఒక విధమైన భావన మెజార్టీ ప్రజల్లో ఉంటుంది. కటువుగా మాటలు.. చేతలు కూడా ఉంటాయన్నది ఒక భావన.. కొన్నిచోట్ల అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ.. పోలీసు వాళ్లలోనూ మనసున్న వాళ్లు కూడా ఉన్నారని నిరూపించారు ఓ ఎస్సై. పోలీసుల ఉద్యోగం సాధించినా.. తాను ఎక్కడ నుంచి వచ్చాడో దాన్ని మర్చిపోకుండా తన కష్టాలను గుర్తు చేసుకుంటూ మరింతమందికి ప్రోత్సహిస్తున్నాడు. అందుకే రెండు సభలో ఓ సాధారణ ఎస్ఐగా ఉన్న ఓ అధికారికి.. స్వయానా శాసన సభాధిపతి పొగడకుండా ఉండలేకపోయారు.
పోలీస్ శాఖలో పనిచేస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని సంతృప్తిగా నిర్వహించడమే కాకుండా.. ప్రవృత్తిగా సేవాపథంవైపు అడుగులు వేస్తున్నారు అనకాపల్లి జిల్లా నాతవరం ఎస్ఐ తారకేశ్వరావు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లలో జన్మించిన తారకేశ్వరరావు తండ్రి ఏఆర్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. చిన్నతనం నుంచి తారకేశ్వరరావుకు క్రీడలపై మక్కువ. బ్యాడ్మింటన్ లో సాధించిన ప్రతిభతో స్పోర్ట్స్ కోటాలో తనకు ఎస్ఐ అవకాశం కల్పించింది.
ఇక తాను ఎంతో శ్రమించి సాధించిన ఉద్యోగాన్ని నిబద్దతతో చేస్తున్నారు తారకేశ్వరరావు. తాను పడిన కష్టం… సాధించిన ఫలితాలను.. తాను పనిచేసిన ప్రాంతంలో యువతలో అవగాహన పెంచి ప్రోత్సహిస్తున్నారు ఎస్సై. తన జీవితంలో ఏకంగా 40% క్రీడలపై ఆసక్తి ఉన్న పేదలైన యువత కోసం కేటాయించి తనలానే ఉద్యోగ అవకాశాలు సాధించే విధంగా తర్ఫీదునిస్తున్నారు. అంతేకాదు.. తాను పనిచేసిన చోట అక్కడ ఔత్సాహికులకు ప్రోత్సహించేందుకు క్రీడాస్థలాలను చదును చేయించి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల 11 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో బీటెక్ లో ఉచితంగా సీట్లు సాధించేలా ప్రోత్సహించారు ఎస్ఐ..
అంతేకాదు.. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారు. వీటికి అదనంగా నిరుపేదలకు భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా తన సేవలు అంతటితో పరిమితం కాకుండా.. పేదల కోసం సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఖాళీ సమయంలో కార్యక్రమాలు చేపడుతున్న ఎస్ఐ తారకేశ్వరరావు.. తన ఉద్యోగ విధుల్లో భాగంగా ఉన్నతాధికారులు విధించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. తుఫాను సమయంలో సైతం అప్రమత్తంగా ఉండి.. ముందస్తు చర్యల్లో భాగంగా మేజరు కాలువలకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు. ఏటా వచ్చే వరదల నివారణలో తన వంతు పాత్ర పోషించారు. వీటన్నింటికీ మించి.. గంజాయికి అలవాటు పడుతున్న యువతను సరైన దారిలో తెచ్చేలా కౌన్సిలింగ్ చేసి వారికి ప్రైవేట్ కొలువులు వచ్చేలా ప్రోత్సహించారు.
వీడియో చూడండి..
నిండు సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందన..
ఎస్సై తారకేశ్వరరావు.. తన విధుల్లోనే కాకుండా.. సేవా కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషిస్తూ మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడే స్వయంగా తారకేశ్వరావు చేపట్టే కార్యక్రమాలను వివరించి.. నిండు సభలో అభినందించారు. తనకు వచ్చే జీతం లో 40% క్రీడా సేవా రంగాలకు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.. అని ఎస్ఐ ని ప్రశంసించారు. జీవితంలో 40 శాతం ఇస్తానంటే నా భార్య కూడా నన్ను ఒప్పుకోదు అని చమత్కరించి ఎస్సై చేస్తున్న సేవను అభినందించారు. అతని ప్రోత్సాహంతో క్రీడాకారులు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు అయ్యన్నపాత్రుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
