ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పరిషత్ ఎన్నికలు

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా, ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 1850 ఎంపీటీసీ స్థానాలకు 6083 మంది అభ్యర్థులు పోటీ […]

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పరిషత్ ఎన్నికలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 10, 2019 | 6:10 PM

రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా, ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 1850 ఎంపీటీసీ స్థానాలకు 6083 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ కోసం 10371 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు వినియోగించారు.