టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల డిష్యుం.. డిష్యుం
సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తండాకు రాగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు తలపడ్డారు. ఒక దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులను వెంటపడి తరిమి మరీ కొట్టారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి […]
సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తండాకు రాగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు తలపడ్డారు. ఒక దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులను వెంటపడి తరిమి మరీ కొట్టారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.