Andhra: పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్ ముందే అతడ్ని నరికి చంపారు.. రీజన్ అదే..
సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ గేట్ ఎదుటే జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొస్తున్న వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన షాక్‌కు గురిచేసింది. అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, వేట కొడవళ్లు, సెల్‌ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరగడం సంచలనం అనుకుంటే.. పోలీసులే తీసుకుని వస్తున్న వ్యక్తిని హత్య చేయడం.. మరింత సంచలనం రేకిత్తిస్తోంది. సత్య సాయి జిల్లాలో తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ ముందే అది కూడా స్వయంగా పోలీసులే తీసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి.. అదే మండలంలోని మార్కూరువాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్పను తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే వేట కొడవలితో తల నరికి హత్య చేశాడు. హరి భార్య నాగమల్లేశ్వరితో… ఈశ్వరప్పకు ఉన్న అక్రమ సంబంధమే హత్యకు కారణం అంటున్నారు పోలీసులు.
ఈనెల 1వ తేదీన హరి భార్య నాగమల్లేశ్వరి కనిపించకపోవడంతో తనకల్లు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హరి భార్య నాగమల్లేశ్వరి గూడూరులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో తనకల్లు పోలీసులు గూడూరు వెళ్తూ.. భార్య నాగమల్లీశ్వరిని గుర్తు పట్టేందుకు భర్త హరిని వెంట తీసుకొని వెళ్లారు. గూడూరులో హరి భార్య నాగమల్లీశ్వరితో పాటు మరో వ్యక్తి ఈశ్వరప్ప కూడా ఉండడంతో… పోలీసులు ఇద్దరినీ తీసుకుని తనకల్లు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు… అయితే తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోవడంతో రగిలిపోయిన భర్త హరి.. ఎలాగైనా ఈశ్వరప్పను హత్య చేయాలని.. గూడూరు నుంచి వచ్చే సమయంలో ఫోన్‌లో తన సోదరుడు చిన్నప్ప మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు కలిసి పోలీస్ స్టేషన్ వద్ద హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు.
నాగమల్లేశ్వరి… ప్రియుడు ఈశ్వరప్పతో కలిసి గూడూరు నుంచి తనకల్లు ఏ సమయానికి వచ్చేది… అన్ని వివరాలు ఫోన్లో తన సోదరుడు చిన్నప్పకు చెప్పి… పోలీస్ స్టేషన్ వద్ద వేట కొడవళ్ళతో కాపు కాయించాడు… సరిగ్గా ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే….. అప్పటికే పథకం వేసిన హరి సోదరుడు చిన్నప్ప… మరో ఇద్దరు వేట కొడవల్లతో సిద్ధంగా ఉన్నారు… ఎప్పుడైతే భార్య నాగమల్లేశ్వరి… ప్రియుడు ఈశ్వరప్ప… భర్త హరి పోలీసు వాహనం దిగి పోలీస్ లోపలికి వెళ్లే సమయంలో… హరి సోదరుడు చిన్నప్ప మరో ఇద్దరు వేట కొడవల్లు తీసుకుని వచ్చి హరికి ఒక కొడవలి ఇవ్వడంతో… ఒక్కసారిగా హరి… సోదరుడు చిన్నప్ప… ఈశ్వరప్పపై దాడి చేసి నరికి చంపారు. పోలీసులు ఉండగానే… వేట కొడవళ్లతో బెదిరించి ఈశ్వరప్పను దారుణంగా హత్య చేశారు. ఒకవైపు ఈశ్వరప్పను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా… హరి భార్య నాగమల్లేశ్వరి… భయంతో తనను కూడా చంపుతారని… అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే పోలీసులు హరి భార్య నాగమల్లేశ్వరుని వెంబడించి… పట్టుకొని…. పుట్టపర్తిలోని కేరింగ్ హోమ్‌కు తరలించారు. ఈశ్వరప్పను హత్య చేసిన… హరి, అతని సోదరుడు చిన్నప్ప… మరో ఇద్దరు నిందితులు శంకరప్ప, గంగులప్పలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుల వద్ద వేట కొడవళ్లు… నాలుగు సెల్ ఫోన్లు… స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
