హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా.. బీకేర్‌ఫుల్..! వెంటాడుతున్న నిఘా నేత్రం..!
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, వీధినాటకాలు ప్రదర్శించడం వంటివి చేశారు, చేస్తున్నారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గుంటూరులో మాత్రం హెల్మెట్ ధరించి బైక్ లు నడిపేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించడం, వీధినాటకాలు ప్రదర్శించడం వంటివి చేశారు, చేస్తున్నారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గుంటూరులో మాత్రం హెల్మెట్ ధరించి బైక్ లు నడిపేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే గుంటూరు పోలీసులు మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలో జరిమానాలు విధించడం లేదు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భావనతో ముందుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సందేశాన్ని గుంటూరు పోలీసులు పంపిస్తున్నారు.
గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లతో పాటు ప్రధాన మార్గాల్లో కూడా సిసి కెమెరాలను అమర్చారు. దీంతో ఆయా ప్రధాన మార్గాల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని సిసి కెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయి. అలా హెల్మెట్ లేకుండా వెలుతున్న వారిని గుర్తించి వారి వాట్సాప్ నంబర్లకు హెచ్చరిక మెస్సెజ్ పంపిస్తున్నారు. ఈ మెస్సెజ్ లో ఫలానా జంక్షన్ వద్ద ఫలానా రోజున ట్రాఫిక్ ఉల్లంఘించినట్లు ఉంటుంది. రహదారి భద్రత సూచనల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మెస్సెజ్ లో ఇది ఇతర ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేస్తుందని చెబుతున్నారు. మోటార్ వెహికల్స్ చట్ట ప్రకారం నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని ఇదే చివరి హెచ్చరిక అన్న మెస్సెజ్ పంపిస్తున్నారు. మరోసారి నిబంధన ఉల్లఘింస్తే జరిమానా విధించనున్నట్లు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా యువత ప్రయాణించే సమయంలో హెల్మెట్ లేకుండా వెలుతుంటే వారిని గుర్తించి వారి మొబైల్స్ కు లేదా వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మెబైల్ నంబర్ కు మెస్సేజ్ పంపుతున్నారు. ఇలా మెస్సెజ్ లు వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తమవుతున్నారు. వెయ్యి రూపాయల జరిమానా కట్టడం కంటే హెల్మెట్ కొనుగోలు చేయడమే బెటర్ అంటున్నారు. హెల్మెట్ పెట్టుకునే ద్విచక్ర వాహనం నడపాలని పోలీసులు చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయని గుంటూరు వాసులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
