Tv9 Effect: “కాడెద్దుగా మారిన కొడుకు” కథనానికి స్పందన.. ఆదివాసీ రైతుకు ఎద్దును ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపీ..

"కాడెద్దుగా మారిన కొడుకు" కథనానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు స్పందించారు. ఆదివాసీ రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. 

Tv9 Effect: కాడెద్దుగా మారిన కొడుకు కథనానికి స్పందన.. ఆదివాసీ రైతుకు ఎద్దును ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎంపీ..
Mp Soyam Babu On
Follow us

|

Updated on: Jun 16, 2021 | 12:20 PM

“కాడెద్దుగా మారిన కొడుకు” TV9 కథనానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు స్పందించారు. ఆదివాసీ రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఆ ఎద్దును ఆ రైతు ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం డొంగర్ గావ్ రైతు అభిమాన్ కు ఎద్దును కానుకగా ఇస్తానంటూ ప్రకటించిన ఎంపి సోయంబాపు రావు. టీవి9 లో ప్రసారమైన కథనానికి స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీవీ9లో ప్రసారం అయిన కథనం…

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు ఆరెకరాల పొలం ఉంది. వానాకాలం పనులు వేగం కావడం వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదును చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజు ఆ ఎద్దు చనిపోయింది. “వ్యవసాయం చేసి ఆ రైతు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. యంత్రాలతో సాగు చేసేంత డ‌బ్బు లేదు. ఇంత‌లో ఖరీఫ్​ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని రెడీ చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఆట‌కం. ఓ ఎద్దు అనారోగ్యంతో అక‌స్మాత్తుగా చ‌నిపోయింది. ఇంత‌లో వ‌రుణుడు ప‌లుక‌రించాడు. డబ్బులు లేకపోవటం.. ఈ ఒడుదొడుకులన్నింటినీ దాటేందుకు.. తన కొడుకునే కాడెద్దును చేశాడు ఆ రైతు. కన్నకొడుకే కాడెద్దులా మారి పొలం చదను చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు 6 ఎక‌రాల‌ పొలం ఉంది. ఖరీఫ్ సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదను చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజున ఓ ఎద్దు చనిపోయింది. ఇప్ప‌టికిప్పుడు మ‌రో ఎద్దును కొనాలంటే కనీసం రూ. 40వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అంత డ‌బ్బు అభిమాన్ వ‌ద్ద లేదు. పైగా సొమవారం వరుణుడు పలకరించడం వల్ల సమయం దాటిపోకుండా ఉండాలంటే పొలాన్ని చదును చేయకతప్పని పరిస్థితి. ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కన్నకొడుకు సాయినాథ్‌నే కాడెద్దుగా మార్చి పొలం చదనుచేశాడు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు