Bhoochakra Gadda: నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి..

Bhoochakra Gadda:  నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో
Bhuchakra Gadda
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2021 | 1:09 PM

Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి గిద్ద‌లూరు వ‌ర‌కూ ఉన్న ప్రాంతంలో మాత్ర‌మే భూచక్రగడ్డ దొరుకుతుంది. ఈ దుంపకి చెంచుల‌కూ అవినాభావ సంబంధం ఉంది. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కనుకనే దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. . న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెబుతారు.

భూచ‌క్ర‌గ‌డ్డ … మీట‌రు నుంచి 20 మీట‌ర్ల పొడ‌వు దాకా భూమిలో ప‌ది, ప‌న్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచ‌క్ర‌గ‌డ్డ దొరికే అవ‌కాశం వుండే ప్రాంతాల్లో ఒక ‌విధ‌మైన మ‌త్తులాంటి వాస‌న వ‌స్తుంద‌ట‌. ఈ వాసనను పసిగట్టే చెంచులు గ‌డ్డ కోసం వేటమొదలు పెడతారు. గ‌డ్డ ఇక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాత సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు చేసిన త‌ర్వాత త‌వ్వ‌డం మొద‌లుపెడ‌తారు. ఇలా తవ్వే సమయంలో ఎవరైతే ఉంటారో వారందరూ ఈ గడ్డను సమానంగా పంచుకుంటారు. గ‌డ్డ మొద‌లు, చివ‌ర్ల‌లో అడుగు మోయిన క‌త్తిరించి, ఎక్క‌డో ఒక‌చోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొల‌కెత్త‌దు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.

భూ చక్రగడ్డ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

భూచ‌క్ర‌గ‌డ్డ ఎంత స‌న్న‌టి లేయ‌ర్ వుంటే అంత ఎక్కువ‌ రుచి వుంటుంది.తీపిగా వుండ‌ద‌ని పంచ‌దార చ‌ల్లి అమ్ముతుంటారు. కానీ పంచ‌దార లేకుండా తిన‌డ‌మే మంచిది. శరీరంలోని వేడిని త‌గ్గస్తుంది. ర‌క్త‌విరోచ‌నాలు, క‌డుపులోప‌ల ప‌డే పుండ్ల‌ను మాన్పుతుంది. ర‌క్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.

ఈ దుంపలను పూర్తిగా ఎవ‌రికీ అమ్మ‌రు. ముక్క‌లుగా మాత్ర‌మే అమ్ముతారు. ఇవ్వాళ్టికీ గిద్ద‌లూరు, నంద్యాల‌, క‌ర్నూలు, శ్రీ‌శైలం, అహోబిలం (ఓబులం) ప్రాంతాల్లో చెంచులే అమ్ముతుంటారు. అయితే ఇప్పుడిప్పుడే హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో వ్యాపారాలు అమ్మడం మొదలు పెట్టారు.

Also Read: సింగపూర్‌లో చైనా వ్యక్తి ఎక్స్‌ట్రాలు.. భారతీయ సిబ్బందిపై తిట్లు.. చివరకు.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?