Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం
జిల్లా స్థాయి అధికారలు ఓ ఆలయం సమీపంలో విందు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను మంచి చెప్పాల్సిన అధికారులే ఇలా కరోనా ఆంక్షలను బ్రేక్ చేయడం...
కరోనా వైరస్ విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాల్సిన అధికారులు బాధ్యతలు మరిచిపోయారు. పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు. జిల్లా స్థాయి అధికారలు ఓ ఆలయం సమీపంలో విందు చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను మంచి చెప్పాల్సిన అధికారులే ఇలా కరోనా ఆంక్షలను బ్రేక్ చేయడం సరిగా లేదని అంటున్నారు. రూల్స్ సామాన్యులకేనా.. అధికారులకు వర్తించవా అంటున్నారు అమ్మవారి భక్తులు. కనీసం సామాజిక దూరం పాటించకుండా విందులో భోజనాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ ఆలయం అడేల్లి పోచమ్మ క్షేత్రం సమీపంలో ఈ విందు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విందుకు జిల్లా ఉన్నతాధికారలు పాాల్గొన్నట్లుగా సమాచారం. ఈ విందు ఏర్పాట్లను డి.ఆర్.డి.ఏ పి.డి వెంకటేశ్వర్లు స్వయంగా చూసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆలయానికి పక్కనే ఉన్న హరితవనంలో వంటలు, విందు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విందుకు జిల్లా అత్యున్నత అధికారితోపాటు జిల్లాస్థాయి అధికారులు హాజరైట్లుగా సమాచారం. కోవిడ్ అంక్షలు కొనసాగుతుండగా ఈ విందులు చేసుకోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విందులో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న వారు డిమాండ్ చేస్తున్నారు. అడేల్లి పోచమ్మ క్షేత్రంలో లాక్ డౌన్ నిభందనలు ఉల్లంఘించిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేవాదాయశాఖ ఉత్తర్వులతో భక్తుల సేవలకు గత నెలరోజులుగా విరామం ఉన్నట్లుగా తెలుస్తోంది.