Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారి కనీస వేతనం పెంపు..
Telangana Government: తెలంగాణ సర్కార్ కూలీలకు శుభవార్త చెప్పింది. రోజు వారి కూలీలకు చెల్లించే కనీస వేతనాన్ని పెంచుతూ నిర్ణయించింది.
Telangana Government: తెలంగాణ సర్కార్ కూలీలకు శుభవార్త చెప్పింది. రోజు వారి కూలీలకు చెల్లించే కనీస వేతనాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోజు వారి కూలీలకు ఉన్న వేతనం రూ. 300 ను రూ. 390 కి పెంచింది. అలాగే.. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనాన్ని రూ. 8 వేల నుంచి రూ.10,400 చేసింది. పార్ట్‌టైమ్ వర్కర్ల జీతాన్ని రూ. 4,000 నుంచి 5,200 లకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
వేతనం పెంచుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై రోజువారీ కూలీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అసలే కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న కూలీలకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనంతో పాటు.. కాస్త ధైర్యా్న్ని కల్పించినట్లు అయిందంటున్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ పీఆర్‌సీ జూన్ నెల నుంచి అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా కూలీల వేతనాలు కూడా పెంచింది రాష్ట్ర సర్కార్.
Also read: