AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel: అలవాటులో పొరపాటు.. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఏం చేశాడో తెలుసా?.. వీడియో హల్‌చల్ చేస్తున్న వీడియో..

Israel: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సేవలందించిన బెంజమిన్ నెతన్యాహు పదవీకాలం ఆదివారంతో ముగిసింది. నేషనలిస్ట్...

Israel: అలవాటులో పొరపాటు.. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఏం చేశాడో తెలుసా?.. వీడియో హల్‌చల్ చేస్తున్న వీడియో..
Benjamin Netanyahu
Shiva Prajapati
|

Updated on: Jun 16, 2021 | 5:11 AM

Share

Israel: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సేవలందించిన బెంజమిన్ నెతన్యాహు పదవీకాలం ఆదివారంతో ముగిసింది. నేషనలిస్ట్ పార్టీకి చెందిన నాఫ్తాలి బెన్నెట్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే, ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నిర్వహించిన విశ్వాస పరీక్ష(ఓటింగ్ ప్రక్రియ)లో ఆయన ఓడిపోయారు. దాంతో నేతాన్యాహు ప్రధాని పదవి పోయినట్లయ్యింది. అయితే ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత.. నేతాన్యాహు తనకు కేటాయించిన సీటు వద్దకు కాకుండా అలవాటులో పొరపాటుగా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అది చూసిన సభ్యులు.. ప్రతిపక్షాలకు కేటాయించిన సీటులోకి వెళ్లాలని కోరారు. దాంతో ఇకపై అది తన సీటు కాదని గ్రహించి.. వెంటనే లేచి మళ్లీ తన సీట్‌లోకి వెళ్లిపోయారు నేతన్యాహు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక దశాబ్దం పాటు నేతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని హోదాలో ఆ సీటులో కూర్చున్నాడని, ఆ కారణంగా తాను ఇంకా ప్రధాని అనే ట్రాన్స్‌లోనే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘కొంచెం కష్టమైన పనే.. మరిచిపోవడానికి టైమ్ పట్టుద్ది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. కాగా, ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం మార్పు పట్ల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఎరేజ్ బిజునర్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. ఈ ఫలితాలను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్‌కు 12 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనకు బ్రేక్ పడింది. కొత్త ప్రధానిగా నఫ్తాలీ బెన్నెట్ ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో జరిగిన విశ్వాసపరీక్షలో నెతన్యాహు ఓడిపోయారు. 120 మంది సభ్యులున్న నెసెట్‌లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుకూలంగా 60 మంది, వ్యతిరేకంగా 59 మంది ఓటేశారు. దీంతో నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నఫ్తాలీ బెన్నెట్ వచ్చే రెండేళ్లపాటు ప్రధానిగా ఉండనున్నారు.

Twitter Video:

Also read:

New Business: గట్టిగా కౌగిలించుకుంటే రూ. 7,300.. ఓ మహిళ సరికొత్త వ్యాపారం.. ఎక్కడంటే..