యూకే లో డెల్టా వేరియంట్ డేంజర్..మళ్ళీ విజృంభిస్తూన్నా తరుణంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం :Delta Variant Video..
బ్రిటన్ లో డెల్టా వేరియంట్ మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో కోవిద్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నగరంలో ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. నిజానికి ...
బ్రిటన్ లో డెల్టా వేరియంట్ మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో కోవిద్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నగరంలో ఆంక్షలను మరో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. నిజానికి వచ్చే నెల 19 నుంచి దేశవ్యాప్తంగా ఆంక్షలను ఎత్తివేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.. ఇప్పటికే గత మార్చి నుంచే ప్రజలు మాస్కుల జోలికి పోవడంలేదు. ఇక భౌతిక దూరం పాటింపు వంటివాటికి స్వస్తి చెప్పారు. కానీ ఈ కొత్త డెల్టా స్ట్రెయిన్ కారణంగా ఇంగ్లండ్…స్కాట్లాండ్, న్యూ సౌత్ వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వంటి చోట్ల కోవిద్ కేసులు పెరుగుతున్నాయి. ఆల్ఫా వేరియంట్ కన్నా ఈ వేరియంట్ 60 శాతం ఎక్కువగా ప్రమాదకరమైనదని నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఈ చోట్ల జులై 19 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.వచ్చేవారం నుంచి ఇతర నగరాల్లో పబ్ లను, నైట్ క్లబ్బులను కూడా అనుమతించనున్నారు. ఆంక్షల ఎత్తివేతలో నెల రోజులు జాప్యం చేసినందువల్ల అమ్మకాల్లో సుమారు 4.23 బిలియన్ డాలర్ల మేర నష్టం వస్తుందని ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ యూకే హాస్పిటాలిటీ అంచనా వేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..విఘ్నేష్ శివన్ కీ రోల్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..!:Nayanthara Netrikann Movie video.