సీఎం స్టాలిన్ కాన్వాయ్ ఆపిన వృద్దురాలు…తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు.:CM Stalin Convoy Stops for a Woman video.
తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనమార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు వేసిన కమిటీలో ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. తాజాగా...
తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనమార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మరో సంఘటనతో వార్తల్లో నిలిచారు. తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు. హంగుఆర్భాటాలకు దూరంగా ఉండే స్టాలిన్.. తాజాగా తన కాన్వాయ్‌ను ఆపి మరీ.. ఓ మహిళ దగ్గర ఫిర్యాదును స్వీకరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులోని పలు జిల్లాల్లో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తిరుచీకి వెళ్ళే మార్గంలో.. ఒక మహిళ.. దరఖాస్తుతో రోడ్డు వెంట నిల్చొని ఎదురు చూస్తోంది.ఈ క్రమంలో కాన్వాయ్ ముందుకు వెళుతోంది. అర్జీతో ఉన్న మహిళను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ కాన్వాయ్ ని ఆపి పిటిషన్‌ను అందుకున్నారు. వెంటనే దానిపై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. అర్జీ తీసుకోవడంతో ఆ వృద్ధురాలు అనందంతో వెనుదిరిగింది. ఇదంతా సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: మందు బాటిల్‌కు పూజలు ఎందుకో తెలుసా ..? నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : aarti for alcohol bottles viral video.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
