కాయలు కాసే చెట్టుపైనే రాళ్లు పడతాయి వైస్ జగన్.. వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల:CM YS Jagan video.
YSR వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
YSR వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు సీఎం జగన్. 2 లక్షల 48 వేల 468 మంది లబ్ధిదారులకు 248 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం లభిస్తోంది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ…వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర అమలు చేశామని వెల్లడించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడటం ద్వారా వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని, దేశంలో ఎక్కడా డ్రైవర్ల కోసం ఇలాంటి పథకం లేదని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహన్నిఆయన కుటుంబసభ్యులతో కలిసి అవిష్కరించిన మంత్రి కేటీఆర్:Col Santosh Babu Statue video.