వైఎస్ షర్మిల పార్టీలో అసంతృప్తి సెగ.. అడహాక్ కమిటీకి మహబూబ్ నగర్ నేతలు రాజీనామా వీడియో :YS Sharmila video.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు. షర్మిల ఇటీవల నియమించిన అడహక్ కమిటీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టక ముందే షర్మిల నియమించిన హడక్ కమిటీలకు వైయస్‌ఆర్ అభిమానులు రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదే దారిలో మరి కొంత మంది షర్మిల నియమించిన హడక్ కమిటీకి రాజీనామాలు చేసేందు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నా తొలి సౌత్ ఇండియన్ హీరో మన రౌడీ బాయ్.. ఇంతకీ విషయమేంటంటే..:Vijay Devarakonda video.
Pooja Hegde Video:హాట్ నెస్ ఓవర్‌లోడెడ్ బుట్టబొమ్మా.. మరీ ఇంత అందమైతే ఎట్టాగమ్మా.. !వీడియో.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
