sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్‌పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన శ్రీధర్ బాబు..

sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పీసీసీ రేస్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ నేతలు..

sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్‌పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన శ్రీధర్ బాబు..
Sridhar Babu
Follow us

|

Updated on: Jun 15, 2021 | 10:53 PM

sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పీసీసీ రేస్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు హడావుడి మొదలు పెట్టారు. దాంతో పీసీసీ ఎంపిక త్వరలోనే జరిగే అవకాశం ఉందని, ఆ కారణంగా నేతలు హడావుడి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మీడియా ముందుకు వచ్చారు. పీసీసీ పదవిపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తాను పీసీసీ రేస్‌లో లేనని స్పష్టం చేశారు. పీసీసీ నియామకం అంశం.. ఏఐసీసీ పరిధిలోనిది అని, ఏఐసీసీ నే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు భూముల విషయంలో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ ప్రైవేటు సంస్థలకు భూములను దారాదత్తం చేయడానికి బరితెగిస్తున్నాయని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఈ నెల 10 వ తేదిన జీ.వో.నెంబర్ 13 పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం దిక్కుమాలిన చర్య అని విమర్శించారు. గత రెండు సంవత్సరాల కాలంగా మాత్రమే కరోనా ప్రభావం రాష్ట్ర ఖజనా పై ప్రభావం చూపుతోందని, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణాను కేవలం రెండు సంవత్సరాల ఒడిదుడుకుల నెపాన్ని చూపి చేతకాని పాలనతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పైగా హైదరాబాద్ తో పాటు ఇతర చోట్ల ప్రధాన ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను అన్నాక్రాంతం కాకుండా ఉండేందుకే వేలం వేస్తున్నట్టు సదరు జీ.వో.తాళింపు వేయడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. దివాలా తీసిన వారే భూములను అమ్ముకుంటున్నారని, దుబారా ఖర్చ తగ్గించుకొని పొదుపు పాటిస్తూ ఆదాయన్ని సమకూర్చుకునే ఆలోచన చేయకపోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. సదరు జీవోని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న 30 వేల ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. ప్రజావసరాలకు భూములను తీసుకోవాలంటే ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ భూములను అమ్మేస్తే భవిష్యత్ లో ప్రభుత్వ సంస్ధల నిర్మాణాలకు భూములు కావాల్సివస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వం సృహాతో ఆలోచించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 13 ను ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హాయంలో అటవీ భూములను పేదలకు ఇచ్చామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల అప్పులు ఎలా అయ్యాయో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అప్పులపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, దళితులకు మూడు ఎకరాలు భూములను ఏవీ అందించకుండా అసలు అంత అప్పు ఎలా అయిందో ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

Also read:

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 1,556 పాజిటివ్ కేసులు నమోదు..