Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 1,556 పాజిటివ్ కేసులు నమోదు..

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. నిలకడగా కొత్త కేసులు...

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 1,556 పాజిటివ్ కేసులు నమోదు..
Corona
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2021 | 10:34 PM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. నిలకడగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,20,043 శాంపిల్స్ సేకరించగా.. వారిలో 1,556 మందికి కరోనా పాజిటివ్ అని తేల్చారు. ఇక ఇవాళ 2,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,933 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.13 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.57 శాతం ఉంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,69,54,634 శాంపిల్స్ పరీక్షించారు. కాగా, తాజాగా బులెటిన్ ప్రకారం నమోదైన గణాంకాలను కలుపుకుని.. తెలంగాణలో ఇప్పటి వరకు 6,06,436 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 5,82,993 మంది కరోనా జయించి ఆరోగ్యంగా నిలిచారు. దురదృష్టావశాత్తు కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 3,510 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 8, బద్రాద్రి కొత్తగూడెం – 114, జీహెచ్ఎంసీ – 182, జగిత్యాల – 26, జనగామ – 21, జయశంకర్ భూపాలపల్లి – 24, జోగులాంబ గద్వాల – 19, కామారెడ్డి – 8, కరీంనగర్ – 88 ఖమ్మం – 131, కొమరంభీం ఆసిఫాబాద్ – 9, మహబూబ్‌నగర్ – 28, మహబూబాబాద్ – 54, మంచిర్యాల – 38, మెదక్ – 15, మేడ్చల్ మల్కాజిగిరి – 91, ములుగు – 29, నాగర్ కర్నూల్ – 20, నల్లగొండ – 135, నారాయణ పేట – 16, నిర్మల్ – 3, నిజామాబాద్ – 18, పెద్దపల్లి – 70, రాజన్న సిరిసిల్ల – 35, రంగారెడ్డి – 90, సంగారెడ్డి – 21, సిద్ధిపేట – 33, సూర్యాపేట – 77, వికారాబాద్ – 22, వనపర్తి – 25, వరంగల్ రూరల్ – 21, వరంగల్ అర్బన్ – 52, యాదాద్రి భువనగిరి – 33 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Hyper Aadi : ‘బాధపెట్టడం..  క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు.. సరైన సమయంలో సరైన రీతిలో ‘హైపర్ ఆది’కి బుద్ధి చెప్తాం’

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?