రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్ పోలీసులు
Police Protection: గుజరాత్‌లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు. పుట్టిన రెండు నెలలకే రెండు సార్లు అపహరణకు గురికావడంతో బాలుడిని రక్షించేందుకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
గుడిసె చుట్టు భారీ భద్రత.. 24×7 రక్షణ.. కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసు అధికారులు.. ఇది ఓ పొలిటికల్ లీడర్ బందువు ఇళ్లు కాదు.. అలా అని ఓ నాయకుడి విలవైన ఆస్తి కూడా కాదు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పెద్ద స్థాయిలో ప్రొటెక్షన్ పెట్టారు పోలీసులు. చీమ చిటుక్కుమన్నా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడో కాదు గుజరాత్‌లోని గాంధీనగర్ పరిధిలో… ఇక విషయానికి వస్తే.. గుజరాత్, గాంధీనగర్‌లోని అదలాజ్ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్ నెలలో మగబిడ్డ జన్మించాడు.
గుజరాత్‌లోని రెండు నెలల బాలుడికి 24×7 రక్షణ కల్పించనున్నారు స్థానిక పోలీసులు. పుట్టిన రెండు నెలలకే రెండు సార్లు అపహరణకు గురికావడంతో బాలుడిని రక్షించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పుట్టిన రెండురోజులకే ఆసుపత్రి నుంచి ఈ బుజ్జోడిని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు.. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు వారంలోగా కిడ్నాప్ చేసిన నిందితులను పట్టుకుని ఈ చిన్నోడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బుడతడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్‌కు గురి అయ్యాడు. మరోసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో కిడ్నాప్‌ను ఛేదించి వీడిని రక్షించారు.
ఆస్పత్రిలోని సీసీ టీవి దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకున్నారు. పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్ అయిన బాలుడికి ఇక మీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. బాలుడి రక్షణ కోసం వాళ్లకు స్థిర నివాసం కూడా ఏర్పాటు చేస్తున్నారు.