YS Sharmila: వైయస్ షర్మిల హుజూర్‌నగర్ పర్యటనలో ఊహించని ట్విస్ట్.. నిరుద్యోగి ఆచూకీ మిస్సింగ్
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి....
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. షర్మిల బుధవారం నల్గోండ జిల్లా హుజూర్‌నగర్ లో పర్యటించాల్సి ఉంది. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసిన నీలకంఠసాయి అనే యువకుడిని ఆమె పరామర్శించాల్సి ఉంది. అయితే ఇక్కడే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యయత్నం చేసిన యువకుడి ఇంటికి మరికాసేపట్లో షర్మిల చేరుకుంటుంది అనుకునేలోపు అతడి ఆచూకీ మిస్ అయ్యింది. యువకుడి ఇంటికి తాళం వేసి ఉందట. షర్మిల పరామర్మకు వస్తుందని నీలకంఠసాయిని కిడ్నాప్ చేశారని షర్మిల టీమ్ ఆరోపిస్తుంది. ఎమ్మెల్యే సైదిరెడ్డి సదరు అతడిని కిడ్నాప్ చేశాడని షర్మిల అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు షర్మిల పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు. షర్మిల ఇటీవల నియమించిన అడహక్ కమిటీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టక ముందే షర్మిల నియమించిన హడక్ కమిటీలకు వైయస్‌ఆర్ అభిమానులు రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదే దారిలో మరి కొంత మంది షర్మిల నియమించిన హడక్ కమిటీకి రాజీనామాలు చేసేందు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఖమ్మం జిల్లాలో వింత.. రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు !