AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam District: ఖమ్మం జిల్లాలో వింత.. రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు !

ఖమ్మం జిల్లాలో వింత చోటుచేసుకుంది. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు ...

Khammam District: ఖమ్మం జిల్లాలో వింత.. రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు !
Lord Rama Tears
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2021 | 11:35 AM

Share

ఖమ్మం జిల్లాలో వింత చోటుచేసుకుంది. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు  వస్తున్నాయంటూ ఆనోటా ఈ నోటా ప్రచారం జరుగుతుంది. ఈ వింతను చూడటానికి చుట్టుప్ర‌క్క‌ల‌ గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్య‌లో తరలి వస్తున్నారు. ఇలా జ‌ర‌గడానికి గ‌ల‌ కార‌ణాల‌పై ప‌లు ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని పీడిస్తున్న వైప‌రిత్యాల నేప‌థ్యంలో.. ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మున్ముందు మాన‌వజాతికి రాబోతున్న‌ మ‌రిన్ని క‌ష్టాల‌కు రాముడి కంట క‌న్నీరే సాక్ష‌మ‌ని కొంద‌రు అంటున్నారు. ఘ‌ట‌న‌పై స‌ద‌రు తండా వాసులు మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ గ్రామానికి ఏమైనా అరిష్ఠం జ‌ర‌తుందనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో రాముల‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆల‌య నిర్వాహ‌కులు. ప్రస్తుతం రాముడి విగ్ర‌హం కంటి నుంచి నీరు వ‌స్తున్న‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌లవుతున్నాయి.

Also Read: తిమింగలం వాంతి పేరుతో దోచేస్తున్నారు.. సీన్‌లోకి సులేమాన్‌ స్టోన్ కూడా

భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.