AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు ముందుకు ఓ వింతకేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని త‌న‌ వ‌ద్దే ఉండేలా అనుమతించాలంటూ ఇటు తల్లి కోర్టు...

Viral News: భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు  కోర్టు ఏం చెప్పిందంటే..
marriage
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2021 | 9:03 AM

Share

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు ముందుకు ఓ వింతకేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని త‌న‌ వ‌ద్దే ఉండేలా అనుమతించాలంటూ ఇటు తల్లి కోర్టు మెట్లు ఎక్కింది. అటు భార్య కూడా భ‌ర్త‌ను త‌న వ‌ద్దే ఉండేలా చూడాల‌ని వేడుకుంది. మైనర్‌ వివాహం చ‌ట్ట ప్ర‌కారం చెల్లుబాటు కాదు కాబట్టి, తల్లి వెంట వెళ్లమ‌ని సూచించ‌గా బాలుడు అందుకు నిరాక‌రించాడు. భార్య‌తోనే ఉంటాన‌ని మొండికేశాడు. ఈ కోరిక మన్నిద్దామంటే.. ఓ మైనర్‌ బాలుడు మేజర్‌ యువతితో సహజీవనం చేస్తే పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. ఈ విచిత్ర ప‌రిస్థితికి ఓ పరిష్కారం చూపుతూ బాలుడికి మైనారిటీ తీరేదాకా అంటే.. 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మైనార్టీ తీరాక అతడు అత‌ని ఇష్టప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆజంగఢ్‌కు చెందిన బాలుడి తల్లి దాఖలు చేసిన పిటిషనుపై విచారణ జరిపిన జస్టిస్‌ జేజే మునీర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 18న ఈ కేసు కోర్టుకు రాగా, జ‌డ్జి అభిప్రాయం రికార్డు చేశారు. మే 31న తుది తీర్పు వెలువరించగా.. రెండు వారాల అనంతరం కోర్టు వెబ్‌సైటులో పెట్టారు. ఇక కొస‌మెరుపు ఏంటంటే.. మేజర్‌ యువతితో బాలుడి సాంగత్యం కారణంగా వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు.

Also Read: చిత్తూరు జిల్లాలో దారుణ ప‌రిస్థితులు.. రోడ్ల ప‌క్క‌న గుట్ట‌లు గుట్ట‌లుగా ‘ఏ’ గ్రేడ్ మామిడి పండ్లు

వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే